ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రత్యేకమైన తెలుగు కంటెంట్ చిత్రాలను అందించడమే కాకుండా, వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ థ్రిల్లర్‌ సినిమాలను డబ్బింగ్ చేసి విడుదల చేస్తుంది. ఈ వారం కూడా ఒక డబ్బింగ్ చిత్రం ను తీసుకురావాలని ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ నిర్ణయించుకుంది. ఈసారి ఒక మలయాళ థ్రిల్లర్ సినిమాను మన ముందుకు తీసుకొచ్చింది. ఆ సినిమా పేరు చతుర్ ముఖం.

అదే టైటిల్ తో ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. ఈ సినిమా నేడు ఆహా ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ కానుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి టెక్నో-హర్రర్ మూవీగా గుర్తింపు పొందిన ఈ సినిమాలో మంజు వారియర్ ప్రధాన పాత్రలో నటించింది. టెక్నాలజీ ద్వారా
కంటికి కనిపించని దుష్టశక్తిని ఎదుర్కొనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఈ సినిమాలో సన్నీ వేన్, నిరంజన అనూప్, రోనీ డేవిడ్ మరియు శ్రీకాంత్ మురళి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రంజీత్ కామ‌ల శంక‌ర్‌ మరియు సలీల్ మీనన్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్ టామ్స్ మరియు జస్టిన్ థామస్ ఈ ప్రాజెక్టును నిర్మించారు.

x