ఒకరి కాలి క్రింద బానిసలా నీచంగా బ్రతికే బదులు లేచి నిలబడి ప్రాణం విడిచిపెట్టడం మేలు. -చే గువేరా

“Che Guevara” Biography in Telugu

తలపై ఒక టోపీ దానిపై ఒక నక్షత్రం పొడవుగా పెరిగిన జుట్టు, తేజస్సుతో నిండిన  ముఖం, నిర్భయంగా చూస్తున్న కళ్ళు, ఏదో ఒక సమయంలో మనం అందరం ఈ రూపాన్ని చూసే ఉంటాం.

Che guevara wallpaper

టీషర్టులు, బైకులు, పోస్టర్లు, వాల్ పేపర్లు, పచ్చబొట్లు ఎక్కడ చుసిన ఇతని రూపమే. సినిమా హీరోల కన్న, క్రీడాకారుల కన్న, ఎక్కువగా యువత ఈయనను అభిమానిస్తున్నారు అంటే అంతలా ఇతను ఏమి చేసాడు. ఎదో ఒక ప్రాంతంలోనో, దేశంలోనే కాదు ఏకంగా అంతట  అతన్ని ఫాలో అవుతుంది.

ఇప్పటి వరకు తెలుసో, తెలియకో మనమందరము అతని ఫోటో వాడి ఉంటాం. కానీ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే ఈ సారి ఆయన ఫోటో చూసినప్పుడు మన శరీరం ఒక రకమైన గర్వం, ధైర్యంతో నిండిపోతుంది. ఆ వ్యక్తి యే చే గువేరా. ఇంత మంది గుండెల్లో నిండిపోయాడు, అంటే ఇతను ఎదో సాధించే ఉండాలి.

ఒక వైద్యుడిగా, రచయితగా, మానవతావాదిగా, ఉద్యమకారుడిగా, ఆయన జీవితం ఎలా సాగిందో అమెరికా ప్రభుత్వం, కొంతమంది నియంత్రులు కలిసి అతన్ని ఏ విధంగా చంపించారో, ప్రపంచం వ్యాప్తంగా యువతలో ఆయన అంటే అంత క్రేజ్ పెరుగిపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం.

Che Guevara Childhood

చే గువేరా అసలు పేరు  ఏర్నేస్తో “చే” గువేరా ఆయన జూన్ 14 1928 వ సవత్సరంలో అర్జెంటీనాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. గువేరాకు చిన్న వయస్సు లోనే ఆస్మా వ్యాధి సోకింది, దానితో ఊపిరి తీసుకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడేవాడు. మొదట్లో ఇంజినీరింగ్ లో చేరాడు కానీ అది నచ్చక అది మానేసి మెడిసిన్ లో చేరాడు. అలా మెడిసిన్ చదువుతునప్పుడు లాటిన్ అమెరికా అంతా ఒక సారి పర్యటించాలి అని అనుకున్నారు.

Che guevara childhood images

1952లో తన స్నేహితుడు ఆల్బర్ట్ తో కలిసి ఒక మోటార్ సైకిల్ మీద, లాటిన్ అమెరికా మొత్తం పర్యటించటానికి బయలుదేరాడు. ఆ ప్రయాణమే చెగువేరా జీవితంలో ఊహించని మార్పులు తీసుకువచ్చాయి. అమెరికా లోని దక్షిణ అమెరికా ప్రాంతాన్ని లాటిన్ అమెరికా అని కూడా అంటారు.

లాటిన్ అమెరికాలోని దేశాలు అన్ని కూడా పేదరికంతో నిండిపోయాయి ఉండేవి. ఉత్తర అమెరికాలోని కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది దోపిడీదారులు ఈ పేద దేశాల్లోని గనులు భూభాగాన్ని ఆక్రమించుకొని అక్కడ ఫ్యాక్టరీలను నిర్మించి ఆ ప్రాంతంలో నివసించే పేద ప్రజలను కూలీలగా మార్చి వారి చేత గొడ్డుచాకిరి చేయించేవారు.

ఇక్కడ సంపదను అంతా వారు దోచుకునేవారు. చే గువేరా చేస్తున్న ఈ ప్రయాణంలో భాగంగా లాటిన్ అమెరికాలోని ప్రజల బానిస బతుకులు కళ్లారా చూసి చలించిపోయాడు. వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలి అని అనుకున్నాడు.

ఆలా 9 నెలలు పాటు ప్రయాణం సాగిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి 1953 లో మెడిసిన్ డిగ్రీ సంపాదించుకున్నాడు చే గువేరా. యుక్త వయస్సు నుండి మాక్సిగన్ విధానాల మీద గువేరాకు ఆసిక్తి ఉండేది. అందుకేనేమో లాటిన్ అమెరికాలోని సామ్రాజ్యవాదులను ఎదురుకోవడానికి తన వైద్య వృత్తి సరిపోదని, విప్లవం ఒకటే దారని అర్ధం చేసుకున్నాడు.        

Che Guevara Marriage

తాను చేయాలనుకున్న దాని గురించి తల్లి దండ్రులకు చెప్పి, బొలీవియాలో  విప్లవాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. అయితే అక్కడ నాయకత్వ లోపం ఉండటం వల్ల, అక్కడ నుండి గ్వాటెమాలకు  చేరుకున్నాడు. అక్కడే ఎంతో మంది విప్లవకారులతో పరిచయం ఏర్పడింది.

Che Guevara marriage

ఆ సమయంలోనే ”హిల్డా” అనే అమ్మాయితో పరిచయం ప్రేమగా మారి పెళ్లి కూడా జరిగింది. వాళ్ళకి అమ్మాయి జన్మించింది. కొంత కాలం తర్వాత క్యూబాలో ప్రతిష్ఠ నియంకృష పాలనకు వ్యతిరేకంగా విప్లవం చేస్తున్న క్యాస్ట్రో గురించి తెలుసుకున్నాడు. చే గువేరా క్యాస్ట్రోని కలుసుకున్నాడు. అలా క్యాస్ట్రో చే గువేరా మరో 82 మందితో కలిసి బాటిస్తాను క్యూబా అధ్యక్ష పదవి నుంచి తొలిగించడానికి షిప్ లో మెక్సికో నుండి క్యూబాకి బయలుదేరారు. ఈ క్యూబా విప్లవ సమయంలోనే చే గువేరా, తన భార్య హిల్డా విడాకులు తీసుకొని విడిపోయారు. అదే సంవత్సరం అలీద మార్చ్ అనే మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

Cuban Revolution by Che Guevara

క్యాస్ట్రో మరియు చే గువేరా  క్యూబాకు చేరిన తర్వాత క్యూబా ప్రభుత్వానికి ఈ రెబెల్స్ కి మధ్య విపరీతమైన దాడులు జరిగాయి. ఈ యుద్ధములో అమెరికా కలుగ చేసుకొని బాటిస్టా ప్రభుత్వానికి ఆయుధాలను అందించి సహాయం చేసింది. క్యూబా విప్లవం జరుగుతున్న ఈ సమయంలో దోపిడీదారులు, పేదలనుంచి దోచుకునేవారిని చే గువేరా వెతికివెతికి చంపేవాడు. అందుకే దోపిడీదారులకు చే గువేరా వస్తున్నాడు అంటే వణుకు పుట్టేది. అలా రెండు సంవత్సరాల తరువాత క్యాస్ట్రో మరియు చే గువేరా కలిసి చేసిన విప్లవం విజయవంతం అయింది.

Che guevara Cuban Revolution

బాటిస్టా ప్రభుత్వాన్ని దింపి క్యూబాలో క్యాస్ట్రో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. క్యాస్ట్రో పాలనలో చే గువేరాకు క్యూబా జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా,  పరిశ్రమ శాఖ మంత్రిగా, రక్షణ దళాలకు అధిపతిగా ఇలా చాలా ఉన్నతమైన పదువులు ద క్కాయి. క్యూబాలో ఉన్న అమెరికా కంపెనీలను జాతీయం చేసేశాడు. తాను పదవిలో ఉన్నప్పుడు అక్కడ ఉండే రైతులు పేదలకు హెల్త్ క్లీనిక్లు, చిన్న పిల్లలకు స్కూల్స్ ను ఏర్పాటు చేశాడు చే గువేరా.

దానితో క్యూబా అక్షరాసితా ఏకంగా 96% పెరిగింది అంటే అది చే గువేరా కృషే. అందుకే క్యూబా దేశ ప్రజలు క్యాస్ట్రోను ఎంతగా అభిమానిస్తారో చే గువేరాను కూడా ఇప్పటికి  అంత గానే అభిమానిస్తారు.

Che Guevara Capture & Death in Bolivia

చే గువేరా 1959 లో మన దేశంలో కూడా పర్యటించి క్యూబాకి ఇండియాకి మధ్య సత్సంబందాలు పెరిగేలా కృషి చేశాడు. అయితే చే గువేరా సామ్రాజ్యవాదుల దోపిడీకి గురవుతున్న ప్రాంతాలలో కూడా తన విప్లవాన్ని తీసుకెళ్లాలని అనుకున్నాడు.

Che guevara capture

ఇంకేం ఆలోచించకుండా తనకున్న గొప్ప గొప్ప పదవులన్నీ వదిలి బొలీవియాలోని నియంత ప్రభుత్వం, అమెరికాతో చేతులు కలిపి సాగిస్తున్న దోపిడీని అంతమొందించడానికి చే గువేరా కొంతమంది భృంధంతో కలిసి బొలీవియాకి బయలుదేరాడు. బొలీవియాలో ఉన్న ఆర్మీ కి సరైన శిక్షణ లేదు, ఆయుధాలు కూడా లేవు.

కాబట్టి వాళ్ళను ఓడించడం సులభమే అనుకున్నాడు చే గువేరా. అయితే ఇక్కడ మళ్ళీ అమెరికా ఎంటర్ అయింది. తమకు క్యూబాలో ఎదురు తిరిగిన చే గువేరాని అంతమొందించడానికి, బొలివియా సైనికులకు శిక్షణ ఇచ్చి, వారికి ఆయుధాలను సరఫరా చేసింది అమెరికా.

ఇప్పుడు చే గువేరాను బంధించడమే అమెరికా ప్రభుత్వం మరియు బొలివియా నియంతలా లక్ష్యం. బొలివియా సైనికులకు చే గువేరా భృందానికి మధ్య దాడులు మొదలయ్యాయి. అయితే బొలివియా అడవులలో సరైన తిండి, నిద్ర లేకపోవడం వల్ల భృంధంలో అందరూ నీరసించిపోయారు.

అందులోనూ చే గువేరాకు ఆస్మా కారణంగా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. తన బరువులో సగానికి పైగా కోల్పోయాడు చే గువేరా. చే గువేరాను పట్టుకోడానికి బొలివియా ప్రభుత్వం 650 మంది సైనికులను రంగంలోకి దింపింది. బొలివియా మరియు అమెరికా కలిసి చేస్తున్న ఈ దాడుల్లో చే గువేరా భృంధంలో ఒక్కొక్కరు చనిపోసాగారు.

ఈ దాడుల్లో చే గువేరా భుజంలో బులెట్ దిగి గాయపడ్డాడు. చివరికి 1967 అక్టోబర్ 8న బొలివియా సైనికులు చే గువేరాను బంధించారు. ఒక పాడుబడిన స్కూల్లో, ఒక చీకటి గదిలో చే గువేరాను నిర్బంధించారు. కానీ విప్లవాగ్నితో రగిలే ఆ సూర్యున్ని చీకటి ఏం భయపెట్టగలదు. ఆ తరువాత రోజే బొలివియా గవర్నమెంట్ చే గువెరాని చంపేయమని ఆదేశాలను పంపింది.

టెర్రా అనే సైనికుడు చే గువేరా ఉన్న గదిలోకి వెళ్ళాడు. చే గువేరా మెల్లగా లేచి నిలబడ్డాడు. దేని గురించైనా ఆలోచిస్తున్నావా? అని అడిగాడు ఆ సైనికుడు, తాను విప్లవం గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించనని సమాధానం ఇచ్చాడు. ఆ కళ్ళల్లో భయం అనేదే లేదు. చే గువేరాకు తెలుసు ఆ సైనికుడు తనని చంపడానికి వచ్చాడని. ఓరి పిరికివాడా కాల్చర నువ్వు నన్ను చంపగలవేమోగాని, నాలో ఉన్న సిద్ధాంతాలను చంపలేవు అని గట్టిగ అరిచాడు.

వెంటనే ఆ సైనికుడు మొదట చే గువేరా కాళ్ళ మీద కాల్చాడు. తర్వాత  ఛాతి మీద, ఇది సుమారు 9 బుల్లెట్లు చే గువేరా శరీరంలోకి దూసుకుపోయాయి. చే గువేరా కుప్ప కూలిపోయాడు. 1967 అక్టోబర్ 9 న చే గువేరా తన తుది శ్వాసను విడిచాడు.

After Death

అక్కడ నుండి చే గువేరా మృతదేహాన్ని బొలీవియాలోని వల్లెగ్రాన్డ్ లోని ఒక హాస్పిటల్ కి తరలించారు. కనీసం హెలీకాఫ్టరులో కూడా కాకుండా, బాడీని తాళ్లతో కట్టి వేలాడదీసుకుంటూ వెళ్లారు. అక్కడ హాస్పిటల్ లోని డాక్టర్ చే గువేరా చనిపోయాడని సర్టిఫికెట్ ఇచ్చారు.

Che Guevara After Death

ఆ తర్వాత చే గువేరాని చూడటానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న వందలాది మంది ప్రజలకోసం చే గువేరా మృతదేహాన్ని అక్కడే 24 గంటలపాటు ఉంచారు. చే గువేరా కి సమాధి కడితే ప్రజలు అతన్ని గుర్తుపెంటుకుంటారని, భవిష్యత్తులో ఆ స్పూర్తితో మరి కొంత మంది విప్లవకారులు వచ్చే అవకాశం ఉందని భయపడి, ఆ బొలీవియాన్ అధికారులు చే గువేరా మృతదేహాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా కప్పెట్టేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే అంతటి వీరుడు చనిపోయాడంటే ఎవరు నమ్మరని వారికి తెలుసు. అందుకే ఆ బొలివియా అధికారులు చే గువేరా రెండు అర చేతులు నరికి ఫార్మాల్డిహైడ్ కెమికల్ లో దాచి, ఆ అరచేతులను క్యూబాకు పంపారు. అక్కడి నుండి వాటిని అర్జెంటీనాలో చే గువేరా వేలి ముద్రలతో మ్యాచ్ చేయడానికి పంపారు. అప్పుడు అవి చే గువేరావే అని ఋజువు అయ్యాయి. ఆ తర్వాత చే గువేరా శవాన్ని ఎవరికి తెలియని ప్రదేశంలో పాతిపెట్టారు.

దాంతో సుమారు 28 సంవత్సరాలపాటు చే గువేరా బాడీని ఎక్కడ సమాధి చేసారో అనే విషయం రహస్యంగానే మిగిలిపోయింది. కానీ ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఆ ప్రదేశాన్ని బయట పెట్టడంతో, చివరికి ఆ ప్రదేశాన్ని తవ్వారు. ఆ గోతిలో చే గువేరాతో పాటు చనిపోయిన మరో ఆరు ఆస్థి పంజరాలు కూడా దొరికాయి. బులెట్ గాయాల ద్వారా గాయపడిన ఎముకల ద్వారా, ముఖ్యంగా ఒక అస్థిపంజరానికి రెండు అర చేతులు లేకుండా ఉండటంతో చే గువేరాకు సంబందించిన ఆస్థి పంజరంగా గుర్తించారు.

తిరిగి వాటిని క్యూబాకి తీసుకొచ్చి అక్టోబర్ 17, 1997న సైనిక గౌరవ మర్యాదలతో మరల అంత్యక్రియలు జరిపారు. ఆయన చనిపోయి 50 సంవత్సరాలు పైన గడించింది.

Legacy of Che Guevara

ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన రగిలించిన విప్లవం మండుతూనే ఉంది. ముఖ్యంగా క్యూబాలో అయితే చే గువేరాని ఒక దేవుడిలా కొలుస్తారు. ఈనాటికి కూడా అక్కడ స్కూల్లో పిల్లలు చెగువేరాని తలచుకుంటూ, మేము కూడా చే గువేరాల తయారవుతామంటూ ప్రతిరోజు ప్రతిజ్ఞచేస్తారు.

Che Guevara Memorial

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉద్యమంగాని, విప్లవంగాని జరిగిన దానికి చే గువేరా రూపంలో ప్రతీకగా నిలుస్తుంది. అంతలా ప్రజల నరాల్లోకి చైతన్యాన్ని ఎక్కించారు చే గువేరా. ఆస్తమా కారణంగా సరిగ్గా ఊపిరిని కూడా తీసుకోలేని ఆయన ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోశారు. ఇప్పుడు ఈయన రూపానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అతని రూపం కొన్ని లక్షల మందికి ధైర్యం.

ఆయన చేసిన పోరాటం, రగిలించిన స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిది, అందుకే ఇప్పటికి అయన సాహసానికి ప్రతీకగా ఒక నిజమైన హీరోగా యూత్ ఐకాన్ గా మనకేగాక రాబోయే తరాలకు కూడా వాళ్ళందరి మదిలో నిలిచిపోతారు చే గువేరా.

x