ఈ సుదీర్ఘ రంజాన్ వారాంతంలో ప్రేక్షకులను అలరించడానికి, OTT ప్లాట్ ఫామ్ రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నాయి. ఆ సినిమాలు ‘చెక్’ మరియు సినిమా బండి. ఈ రోజు సన్ నెక్స్ట్ లో చెక్ ప్రీమియర్ ఉండగా, సినిమా బండి మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుంది.

చెక్ మూవీ :

చంద్రశేఖర్ యెలేటి దర్శకత్వం వహించిన ఈ చెక్ సినిమా లో నితిన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. దీనికి బాక్సాఫీస్ వద్ద ఒక మాదిరిగా ఆడింది. థియేటర్లలో చూడటం తప్పిన వ్యక్తులు ఇప్పుడు సన్ నెక్స్ట్ లో ఈ సినిమాను చూడవచ్చు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు.

సినిమా బండి మూవీ :

బాలీవుడ్ దర్శకులు రాజ్ మరియు డికెల మద్దతుతో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలచేస్తున్నారు. ఈ సినిమాలో పూర్తిగా కొత్త వారు నటించారు. అయినప్పటికీ ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది మరియు విడుదలైన తర్వాత ఇప్పుడే ఎంత మంచి స్పందన వస్తుందో చూడాలి.

x