Check Movie Review in Telugu
యంగ్ హీరో నితిన్, విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “చెక్”. మానమంతా చిత్రం తర్వాత 4 ఏళ్ళ గ్యాప్ తో మరియొక సరికొత్త కథనంతో చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించారు. ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్యమైన పాత్ర పోషించింది.
సాయి చంద్, మురళి శర్మ సంపత్ రాజా, పోసాని ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. రీసెర్ ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ మూవీ, ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెంచేసాయి. మరి నేడు థియేటర్సులోకి వచ్చిన ఈ మూవీ హిట్ అందించిందా? లేదా? అని ఇప్పుడు చూద్దాం.
Check movie story analyzation:
ముందుగా కథ విషయానికి వస్తే, ఆదిత్య టెర్రరిస్టులకు సహాయం చేసారన్న కారణంతో, ఖైదీ విధిస్తారు. దేశ ద్రోహిగా ముద్ర వేస్తారు. అలంటి సమయంలో మానస అనే ఒక లాయర్ అనూహ్య పరిస్థితిలో ఆదిత్య కేసును వాదించవలసి వస్తుంది. అప్పటికే డీలా పడిపోయిన ఆదిత్యకు మానస జీవితంపై ఆశ కలిగిస్తుంది.
సహజంగా చెస్ క్రీడాకారుడు అయిన ఆదిత్యకు ఛాంపియన్‌షిప్ ఆటలో ఆడేందుకు అర్హత సాధిస్తాడు. ఆలా ఎన్నో ఛాంపియన్‌షిప్ గేమ్స్ గెలిచిన ఆదిత్య, జైలు గోడల మధ్య మాస్టరుగా నిలుస్తాడు. తన జైత్రయాత్రను కొనసాగిస్తూ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ వరకు చేరుకుంటాడు.
అలాగే గ్రాండ్ మాస్టర్ టైటిల్ కూడా గెలుచుకుంటాడు. ఒక పక్క జైల్లోనే ఉంటూనే చెస్ లో రాటు తేలతాడు. సహాజంగానే టెర్రరిస్టులకు సహాయం చేశాడా? అతని లాయర్ మానస అతన్ని కాపాడగలిగిందా? లేదా? చెస్ లో విజయాలను సాధించిన ఆదిత్య మరి శిక్ష నుండి తప్పించుకోవడంలో విజయం సాధించాడా? లేడా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిన అసలు కథ.
Check movie analysis:
ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే చంద్రశేఖర్ యేలేటి వంటి విలక్షణ దర్శకుడు నుండి ఎలాంటి సినిమా అయితే ప్రేక్షకులు కోరుకుంటారో, అలాంటి ఒక కొత్త సబ్జెక్టుతో సినిమా తెరకెక్కిందని చెప్పవచ్చు.
ఎంతో నీట్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. ఒక కోర్టు సీనుతో సినిమా ఆసక్తికరంగా స్టార్ట్ చేసారు. నితిన్ తో సహా, మరి కొంతమందికి ఉరి శిక్ష వేయాలని తీర్పుతో సీను రావటంతో సినిమాపై ఇంటరెస్ట్ పెరుగుతుంది. జైలరుగా మురళి శర్మ, లాయరుగా రకుల్ ఇలా ఒక్కో పాత్రలని ముఖ్య పాత్రలకి కనెక్ట్ చేయటం బాగుంది.
నితిన్ సహచర ఖైదీగా నటుడు సాయి చంద్ నితిన్ కి చెస్ ఆట నేర్పిస్తున్న సన్నివేశాలు, అలాగే రకుల్ మరో పక్క నితిన్ కేసును టేక్ అప్ చేసి అతని కోసం పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తరువాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి ఎంట్రీ అవుతుంది.
అక్కడ ప్రియా ప్రకాష్ తో ప్రేమ సన్నివేశాలు సాగుతుండగానే, కథ ప్రెజెంట్ కి రావటం ఒక కొత్త కోణంలో సినిమా సాగుతుంది. స్టార్టింగ్ సినిమా కొంచెం స్లో అనిపించినా, మెల్లగా సినిమాలోని యూనిక్ పాయింట్ వరకు తీసుకెళ్లటం, అలాగే నితిన్ చాలా బాగా చేయటం ఇంటర్వెల్ సమయానికి ఆసక్తికరమైన ట్విస్టువంటి వాటితో ప్రథమార్ధం ఆకట్టుకునేలాగానే సాగుతుంది.
అయితే కథలో ఉన్న లోతు వల్ల సినిమా మరికొంత పెంచి ఉండచవచ్చని అనిపిస్తుంది. కానీ థ్రిల్లింగ్ కథాంశానికి ఇదే సరైన రన్ టైం. ఆ బ్యాలన్స్ పై దర్శకుడు మరింత ఫోకస్ చేయాల్సి ఉంది. లాజిక్ పై ఎక్కువ ఫోకస్ చేసి, ఎమోషన్ కొంచెం తగ్గిన ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో కొంత స్లో గా అవుతుంది.
అయితే మళ్ళీ క్లైమాక్స్ సమయానికి ప్రేక్షకులకు మంచి ఫీలింగుని అందిస్తారు. చెస్ లో విజయాలు సాధించటం, ఆ క్రమంలో టెర్రరిస్టుగా అవమానాలు ఎదుర్కోవడం, లాయరుగా రకుల్ పోరాటాలు, అన్ని ద్వితీయార్ధ ఎండింగుని మంచి ఫీల్ తో ముగిసేలా చేసాయి. మాస్ మసాలా, రొటీన్ కథాంశాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు మంచి రెఫ్రెషింగుగా ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది చెక్.
Check Movie Cast
ఇక నటీనటుల విషయానికొస్తే, ఈ సినిమాలో ప్రేక్షకులు నితిన్ లో కొత్త నటుణ్ని చూస్తారు. అద్భుతమైన వేరియేషన్స్ తో నితిన్ ప్రదర్శించిన నటన, ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్. ఈ సినిమాలో నటుడుగా తనలోని మరో కొత్త కోణాన్ని నితిన్ ఆవిష్కరించాడనే చెప్పాలి. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ప్రియా ప్రకాష్ గ్లామరుతో ఆకట్టుకుంది.
సాయి చంద్ తన నటనతో సినిమాను మరొక లెవెలికి తీసుకెళ్లారు. సంపత్ రాజ్ కమీషనరుగా మెప్పించారు. పోసాని, మురళి శర్మ వంటి వారు అలవాటు ఆయినా నటనలో అల్లుకుపోయారు. హర్ష వర్ధన్, చైతన్య కృష్ణ ఉన్నంతలో అలరిస్తారు. మిగతా వారు పరిధి మేరకు ఓకే అనిపిస్తారు.
Movie Technical details
దర్శకుడు పనితీరు చుస్తే, కొత్త తరహా స్క్రిప్ట్ ఈ సినిమాను మరింత ఆసక్తిగా మారుస్తుంది. సాధారణంగా రచనలలో చంద్ర శేఖర్ యేలేటి కనబరిచే వైవిధ్యం ఈ సినిమాలో కూడా మరింత మెట్టు ఎక్కువగా ఉంటుంది. అన్నింటికంటే ఈ సినిమాకి మేజర్ హైలైట్ స్క్రీన్ ప్లే. రచన గొప్పగా ఉన్నపుడు, స్క్రీన్ ప్లే కూడా అందుకు తగ్గట్టుగా ఉంటే, ఆ సినిమాలో మంచి ఫీలింగు ఉంటుంది.
ఈ విషయంలో ఎలాంటి పొరపాటు చేయలేదు యేలేటి. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కళ్యాణి మాలిక్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా టెన్షన్ రెట్టింపు చేస్తుంది. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉండటంతో పాటుగా అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మంచి ఫీలింగ్ ఇస్తాయి. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకా ఫోటోగ్రఫీ కూడా మెప్పిస్తుంది.
చాలా సన్నివేశాలని రియలిస్టిక్ గా చక్కగా చూపించారు. మొత్తం మీద చుస్తే ఒక కొత్త తరహా చిత్రాన్ని అంతే కొత్తగా తెరపై చూపించారు. ప్రథమార్ధంలో అక్కడక్కడా, ద్వితీయార్ధంలో ప్రీ క్లైమాక్స్ ముందు కొంత స్లో అవటం మినహాయిస్తే, సినిమా అందరిని ఆకట్టుకుంటుంది.
Check Movie rating
మూవీ రేటింగ్ 2.8/5