ఒక చిన్నారి రోడ్డు పక్కనే కూర్చొని మామిడి పళ్లును అమ్ముతుంది. ఆ చిన్నారి వద్దకు ఓ వ్యక్తి వచ్చి మామిడి పళ్లు ధర అడగకుండా ఒక్కొక్క మామిడిపండును 10 వేల రూపాయలకు తీసుకుంటున్నట్లు బాలికకు చెప్పారు. ఆ వ్యక్తి చెప్పినట్లు గానే 12 మామిడి పళ్లును తీసుకొని ఒక లక్షా 20 వేల రూపాయలను బాలిక తండ్రి బ్యాంక్ అకౌంట్ కి పంపించారు.

ఈ సంఘటన ఝార్ఖండ్ లోని జంషెడ్‌పూర్ లో జరిగింది. ఆ చిన్నారి పేరు తులసి కుమారి. సాయం చేసిన వ్యాపారవేత్త పేరు ‘అమెయా హేతే’. పేద కుటుంబానికి చెందిన ఈ చిన్నారి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో పాఠశాలలు మూతపడి ఆన్లైన్ లోనే క్లాస్ లు నిర్వహిస్తున్నారు.

దీంతో స్మార్ట్ ఫోన్ కొనే స్తోమతి లేక ఆ చిన్నారి రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతుంది. అయితే, ఆ చిన్నారి తన ఆర్థిక కష్టాల గురించి స్థానిక మీడియాకు తెలిపింది. స్థానిక మీడియా ద్వారా చిన్నారి పరిస్థితి తెలుసుకున్న అమెయా హేతే అనే వ్యాపారవేత్త చలించిపోయారు. దీంతో ఆ చిన్నారికి సాయం చేయాలనుకున్నాడు.

అలా తులసి వద్దకు వచ్చి మామిడి పళ్లను ఒక్కక్కొటి రూ.10వేలు చొప్పున.. మొత్తం 12 మామిడి పళ్లును లక్షా 20వేల రూపాయలకు కొన్నారు. దీంతో ఆ చిన్నారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. డజన్ మామిడి పళ్లును తీసుకొని డబ్బులను చిన్నారి తండ్రి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. దీంతో చిన్నారి స్మార్ట్ ఫోన్ కొని ఆన్లైన్ క్లాసులకు హాజరవుతుంది.

x