బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి ‘సురేఖా సిక్రీ’ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సురేఖా సిక్రీ ‘చిన్నారి పెళ్లి కూతురు’ అనే టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఆ సీరియల్ లో ఆమె ‘కళ్యాణి దేవి’ అనే పాత్ర చేసి తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు.

ఆమె 1945వ సంవత్సరం ఏప్రిల్ 19న జన్మించారు. ఆమె హేమంత్ రేగే అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు మరియు వీరికి రాహుల్ సిక్రీ అనే కుమారుడు ఉన్నారు. 1978 లో పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన “కిస్సా కుర్సి కా” చిత్రంతో సురేఖా సిక్రీ తెరంగేట్రం చేశారు. 1998 లో వచ్చిన ‘తమస్’ సినిమాకు, 1995 లో వచ్చిన ‘మమ్మో’ సినిమాకు మరియు 2018 లో వచ్చిన ‘బధాయ్ హో’ అనే సినిమాలకు ఆమె జాతీయ అవార్డులు అందుకున్నారు.

ఆమె వయస్సు 75 సంవత్సరాలు. ఆమె కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. ఇంతకముందు ఆమెకు 2018 లో పక్షవాతం మరియు 2020 లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సురేఖా సిక్రీ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

x