చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క చిరంజీవి మోహన్ రాజ్ తో గాడ్ ఫాదర్ (లూసిఫర్ రీమేక్) షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇది కాకుండా మెహర్ రమేష్ తో భోళా శంకర్ (వేదాళం రీమిక్) మరియు బాబి తో ఓ సినిమాను చేయనున్నారు.

తాజాగా చిరంజీవి అజిత్ నటించిన మరో సినిమా యొక్క రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘యెన్నై అరింధాల్‌’ మూవీ యొక్క రీమేక్ హక్కులను చిరు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గాని’ అనే పేరుతో రిలీజ్ అయింది.

ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ కోసం చిరంజీవి ఓ డైరెక్టర్ ను వెతుకుతున్నారు. హంతకుడు నుండి ఓ యువతిని కాపాడే మాజీ పోలీస్ అధికారి గా చిరంజీవి ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని చిరు హోమ్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. మరి చూడాలి చిరంజీవి ఈ సినిమాకు ఏ డైరెక్టర్ ను ఎంపిక చేస్తారో..?

x