తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మరియు పంపిణీదారుల అభ్యర్థనలను చిరంజీవి సీఎం జగన్ ముందుకు తీసుకు వెళ్లారు. దీనిపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, ఇరు వర్గాలను సంతృప్తి పరిచే పరిష్కారాన్ని చూపిస్తామని హామీ ఇచ్చారు.అయితే, ఈ ప్రత్యేక సమావేశానికి కొన్ని మీడియా సంస్థలు రాజకీయ రంగులు వేస్తుండటంతో చిరు స్పందించారు.

ఈ రోజు చిరంజీవి ట్విట్టర్ వేదికగా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని స్పష్టం చేశారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క ప్రయోజనాల కోసం, థియేట్రికల్ వ్యాపారానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్వహించాలనే ఉద్దేశంతో నేను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాను.

అయితే, నాకు రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్న, నాకు ఎటువంటి పదవి ఇచ్చిన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను” అని చిరంజీవి అన్నారు.

x