చిత్తూరు జిల్లా లో మహమ్మారి కరోనా విజృంభిస్తుంది. ఈ జిల్లా మరణాల రేటులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది, కాకపోతే అదే స్థాయిలో రికవరీ రేట్ ఉండటం కాస్త ఊరట కలిగిస్తుంది. మరోవైపు చిత్తూరు జిల్లా లోని తిరుపతి డేంజర్ జోన్ గా మారింది. చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థ లతోపాటు శ్రీకాళహస్తి, మదనపల్లె మున్సిపాలిటీ లో కరోనా కేసుల విపరీతంగా పెరుగుతున్నాయి.

చిత్తూరు జిల్లా లో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా కరోనా తో చనిపోయారు. వారిలో ఎక్కువ మంది తిరుపతి కి చెందిన వారు. కరోనా వచ్చిన వ్యక్తులు ఆసుపత్రిలో సమయానికి చేరకపోవడం కూడా మరణాల రేటు పెరగడానికి దారి తీస్తుంది. ఫస్ట్ వేవ్ లో హాస్పటల్ లో చేరిన వ్యక్తులు చాలా వరకు ఆక్సిజన్ అవసరం లేకుండానే కోలుకున్నారు, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు హాస్పటల్ కి వచ్చే సరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీనితో ఆక్సిజన్ మరియు ఐసీయూ పలకలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు కరోనా తో బాధపడుతున్నవారిలో మగవారే ఎక్కువగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా తిరుపతికి చెందినవి. ప్రస్తుతం 18 గంటల కర్ప్యూ కొనసాగుతుండటంతో పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

x