గుంటూరు జిల్లా లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా లోని చుండూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ శ్రావణి, మరియు కానిస్టేబుల్ రవీంద్ర శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. కానిస్టేబుల్ రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

శ్రావణి చుండూరు పోలీస్‌ స్టేషన్‌కు గత సవంత్సరం అక్టోబరులో ఎస్‌ఐగా బాధ్యతలు తీసుకున్నారు. కానిస్టేబుల్ రవీంద్ర గత అయిదేళ్ల నుండి ఆ చుండూరు పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపడుతున్నాడు. అయితే వీరిద్దరూ సన్నిహితంగా ఉండేవారని తెలిసింది. ప్రస్తుతం ఏం జరిగిందో తెలియదు గాని వారిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

జరిగిన ఈ ఘటన పై ఆ స్టేషన్ కు చెందిన సీఐ రమేష్‌బాబు ఇలా చెప్పాడు, శనివారం ఎస్ఐ శ్రావణి స్టేషన్ కి రాలేదని, వారెందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని తమకు తెలియదని చెప్పారు. వారు పురుగుల మందు తాగిన తర్వాత వారే స్వయంగా తెనాలిలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని సీఐ రమేష్‌బాబు గారు తెలిపారు. ప్రస్తుతం వారు స్పృహ‌లో లేరు. వారు కోలుకున్న తర్వాత పూర్తీ వివరాలు చెబుతామని ఆయన అన్నారు.

శ్రావణి చుండూరు పోలీస్ స్టేషన్ కి రావడానికి ముందు ఆమె నర్సరావుపేట లో దిశా పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహించారు. ఆమెది ప్రకాశం జిల్లా, కానిస్టేబుల్ రవీంద్రది కార్లపాలెం (గుంటూరు జిల్లా). శ్రావణి రవీంద్రను తన సోదరుడిగా భావించేదని అంటున్నారు. వారి సంబంధం పై తప్పుడు ప్రచారం రావడం తో వారు ఈ ఘటనకు పాల్పడ్డారని సమాచారం.

x