ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రాల్లో ‘అయ్యప్పనుమ్ కోషియం’ ఒకటి. దర్శకుడు సాగర్ కె.చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ పై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కి దీటుగా దగ్గుబాటి రానా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించడంతో పాటుగా మెంటర్ గా పనిచేస్తున్నారు. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మూవీమేకర్స్ ఈ కథలో చాలా మార్పులు చేశారు.

ఈ చిత్రం కోసం సినిమాటోగ్రాఫర్ ‘ప్రసాద్ మూరెళ్ల’ ను తీసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు ప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒక వారం రోజుల పాటు వాయిదా పడింది. ఆయన తప్పుకోవడం వల్లే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు. ఇంతకముందు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, కాటమరాయుడు వంటి చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో మరో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

రవి చంద్రన్ హిందీలో బాయ్స్, అమృత, యువ, సిటిజెన్, బ్లాక్, రబ్ నే బనాదీ జోడి, గజినీ, మై నేమ్ ఈజ్ ఖాన్ అనే సినిమాలతో పాటు అమీర్ ఖాన్ నటించిన ఫనా సినిమాకు కూడా పని చేశారు. తెలుగులో మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా కోసం కూడా ఆయన పనిచేశాడు. అయితే, ఈ విషయం పై మూవీ మేకర్స్ త్వరలోనే ఒక క్లారిటీ ఇవ్వనున్నారు.

x