2021 వేసవి లో చాలా సినిమాలు విడుదల చేయాలని టాలీవుడ్ పరిశ్రమ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ మహమ్మారి కరోనా రెండవ దశ వల్ల ఆ ఆశలు మొత్తం చెదిరిపోయాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ” సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను సమ్మర్ మొదట్లో విడుదల చేయాలనీ మూవీ మేకర్స్ భావించారు.
కానీ, కరోనా రెండవ దశ వల్ల నైట్ కర్ఫ్యూ మరియు థియేటర్లు మూసుకుపోవడంతో ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడింది. మూవీ మేకర్స్ కు అనేక ఓటీటీ ఆఫర్లు వచ్చినప్పటికీ వాళ్లు మాత్రం సినిమాను థియేటర్ లో రిలీజ్ చేయాలని భావించారు. ప్రస్తుతం కరోనా రెండవ దశ తగ్గిపోవడంతో మేకర్స్ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మేరకు సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు. కానీ, సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాల్లో పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల, హీరో ధనుష్ తో కలిసి పాన్ ఇండియా ను తెరకెక్కించనున్నారు.