ఢిల్లీ తన పూర్తి లాక్డౌన్ను ఒక వారం రోజుల పాటు పొడిగించిన తరువాత, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 రోజుల పాటు పూర్తి లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 27 న నుండి పూర్తి లాక్డౌన్ ప్రారంభమవుతుంది, బెంగళూరు నగరంతో సహా కర్ణాటక ఏప్రిల్ 27 న నుండి పూర్తి లాక్డౌన్ లోకి వెళ్లనుంది. ఈ రోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత సిఎం యడ్యూరప్ప దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశాడు. నిత్యావసర వస్తువులు కొనడానికి ప్రజలు ఉదయం 6 నుండి 10 గంటల మధ్య బయటకు రావచ్చని అయన చెప్పారు.

“అన్ని మంత్రులు మరియు నిపుణులతో మాట్లాడిన తరువాత, ఏప్రిల్ 27 నుంచి రెండు వారాల పాటు రాష్ట్రంలో పూర్తి లాక్డౌన్ విడుస్తున్నామని” అని ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప విలేకరుల సమావేశంలో అన్నారు. సాంకేతిక సలహా కమిటీ (టిఎసి) రెండు వారాల పూర్తి లాక్డౌన్ విధించామని సలహా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కర్ణాటకలో ప్రసుతం రాత్రి కర్ఫ్యూ మరియు వీకెండ్ లాక్డౌన్ ఉన్నాయి. అయినప్పటికీ, కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా 34,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఒక్క రోజులో రాష్ట్రంలో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. దీనితో రాష్ట్రంలో మొత్తం యాక్టీవ్ కేసులు 1.6 లక్షలకు పైగా ఉన్నాయి, కర్ణాటక రాష్టంలో బెంగళూరు నగరం అగ్రస్థానంలో ఉంది.

x