తమిళనాడులో సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలు కానున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మొదట తమిళనాడు ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నివారించడానికి మే 10 నుంచి మే 24 వరకు లాక్ డౌన్ విధించింది. అయినా కరోనా కేసులు తగ్గకపోవడంతో మరోసారి తమిళనాడు ప్రభుత్వం మే 24 నుంచి మే 31 వరకు ఒక వారం రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు వారం రోజుల పాటు ఈ సంపూర్ణ లాక్డౌన్ ఉండదంట రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యవసర సరుకులు కొనుక్కునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

x