బాహుబలి సినిమాతో ప్రభాస్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ప్రస్తుతం పుష్ప తీసుకొచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా అల వైకుంఠపురం లో సినిమాను హిందీలో డబ్ చేస్తున్నారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ నెలలో 26న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

పుష్ప సినిమా తో బన్నీ ప్యాన్ ఇండియా లోకి అడుగుపెట్టిన, సినిమా రిలీజ్ సమయంలో ఫోకస్ అంతా తెలుగు, తమిళం పైనే ఎక్కువగా ఉండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అల్ రెడీ మలయాళంలో సూపర్ క్రేజ్ ఉండి. హిందీలో డబ్ చేసి వదిలితే ఊహించని విధంగా 80 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ చూసి బాలీవుడ్ వర్గాలు కూడా షాక్ కు గురయ్యారు.

దీంతో పుష్ప క్రేజ్ ను ఉపయోగించుకొని 2020 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురం లో” సినిమా ను హిందీలో డబ్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ డబ్బింగ్ వెర్షన్ ను గోల్డ్ మైన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ సినిమాను ఆల్రెడీ హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ ను నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్, టి సిరీస్ సంస్థ తో కలిసి నిర్మిస్తున్నారు.

కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతుంది. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ పైన ఉండగా మరో వైపు ‘అల వైకుంఠపురం లో’ సినిమాను డబ్ చేసి డైరెక్ట్ గా రిలీజ్ చేయడం విచిత్రంగా ఉంది. ‘అల వైకుంఠపురం లో’ డబ్బింగ్ వర్షన్ బాలీవుడ్లో హిట్ అయితే దీని రీమిక్ ఎవరు చూస్తారు.

దీంతో ఈ మధ్యనే మొదలైన ఈ సినిమాను ఆపేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఊర మాస్ పుష్పను హిందీ ప్రేక్షకులకు రుచి చూపించిన బన్నీ ‘అల వైకుంఠపురం’ అంటూ స్టైలిష్ లుక్ తో కనిపించనున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ ఆడియెన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.

x