ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల 68 వేల 833 మంది కరోనా భారిన పడ్డారు. అదే విధంగా కొత్త వేరియంట్ ‘ఓమిక్రాన్’ భారిన పడ్డ వారి సంఖ్య 6 వేలు దాటింది. దేశంలో రోజువారి పాజిటివ్ రేటు16.66 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 14 లక్షల 15 వేలకు పైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో కొత్తగా 43 వేల కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 28వేల కేసులు, ఢిల్లీలో 24 వేల కేసులు, తమిళనాడులో 23 వేల కేసులు, బెంగాల్లో 22 వేల కేసులు, యూపీ మరియు కేరళలో16 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. రాజస్థాన్ లో కూడా కొత్తగా 10 వేల మంది కరోనా భారిన పడ్డారు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే, గడచిన 24 గంటల్లో 2 వేల 398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా తో 3 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4 వేల 52 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 21 వేల 676 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, “వరుసగా రెండవ రోజు కూడా 4 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 4 వేల 528 కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా భారి నుంచి నిన్న 418 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 వేల 313 యాక్టీవ్ కేసులు ఉన్నాయని” వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

x