తెలంగాణాలో నమోదైన కేసుల వివరాలు:

కరోనా కేసుల వివరాల్లో తెలంగాణ కొత్త రికార్డు సాధించింది. రోజువారి కేసుల సంఖ్య 7000 కు పైగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7432 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 1464 కేసులుమేడ్చల్ లో 606 కేసులు,రంగారెడ్డి జిల్లాలో 504 కేసులు నమోదయ్యాయి.దీనితో తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,87,106 కు చేరింది.

తెలంగాణా రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కూడారోజు రోజూకు భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో వైరస్ భారీన పడి 33 మంది చనిపోయారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,965 మంది కరోనా భారిన పడి చనిపోయారు. రాష్టంలో ఇప్పటివరకు 3 లక్షల 26 వేలకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్టంలో 58 వేల 148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 86.16 శాతం మరియు మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి, సెకండ్ వేవ్ లో వరుసగా రెండోవ రోజు కోవిడ్ కేసులు 10000 పైగా దాటాయి. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 11,766 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 38 మంది కరోనా భారిన పడి చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షల 9 వేల 228 కరోనా కేసులునమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనాతో నెల్లూరులో 6, చిత్తూరులో 5, మరియు తూర్పు గోదావరి, కృష్ణ, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు చొప్పున చనిపోయారు. విశాఖ జిల్లలో ముగ్గురు, గుంటూరు మరియు విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనా భారిన పడి మృతిచెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,579 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 74 వేల 231 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

x