దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో వస్తున్న కొత్త కేసులు ప్రజలను కలవరపెడుతోంది. ఒక పక్కతెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ ఆగటం లేదు. రోజురోజుకు మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో గడచిన 24 గంటల్లో 3 లక్షల 66 వేల 317 మందికి కరోనా సోకింది.

తాజాగా కరోనా నుంచి 3 లక్షల 53 వేల మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 3,747 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 26 లక్షల 62 వేలా 410 కేసులు నమోదయ్యాయి. దేశంలో మరణాల రేటు 1.09 గా ఉంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 71.75 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

x