ఏపీ లో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులు మరియు మృతుల వివరాలు..

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 60 వేల 124 నమూనాలను పరీక్షించగా 14 వేల 986 మందికి పాజిటివ్ వచ్చింది. ఒక రోజే కరోనాతో 84 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో 13 లక్షల 2 వేల 589 కేసులు నమోదయ్యాయి. మరణాలు 8 వేల 791 చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఒక లక్షా 89 వేల 367 గా ఉంది.

తెలంగాణాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కరోనా కేసులు మరియు మృతుల వివరాలు..

తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 65 వేల 923 నమూనాలను పరీక్షించగా 4 వేల 826 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5 లక్షల 02 వేల 187 కి చేరింది. తాజాగా 32 మంది కరోనా వల్ల కన్నుమూశారు. తెలంగాణాలో ఎప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2 వేల 771 చేరింది.

ప్రస్తుతం తెలంగాణలో 62 వేల 797 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 7 వేల 754 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 723 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, చత్తీస్గఢ్ రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తుండగా, సోమవారం నుంచి తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్లో లాక్ డౌన్ అమలు చేసారు.

x