దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి, ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,000 కేసులు నమోదు అయితే అందులో 10,000 కేసులు ”మహారాష్ట్ర” నుంచి వచ్చాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో మళ్ళీ లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
కరోనా మహమ్మారి నుంచి బయట పడ్డాము అనుకున్న తరుణంలో మళ్ళీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు కోటి పన్నెండు లక్షల మందికి వైరస్ సోకగా అందులో కోటి ఎనిమిది లక్షల యాబై వేల మంది కోలుకున్నారు. మరో లక్షా ఎనబై వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నూట ఎనిమిది మంది మరణించారు. మృతుల సంఖ్య 1,57,656 కు చేరింది. మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. 82 శాతం కొత్త కేసులు మహారాష్ట్ర,కేరళ,పంజాబ్,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. 70 శాతం కోవిడ్ మరణాలు కొమార్భిడిటిస్ ఉన్న వారిలోనే సంభవిస్తున్నాయి.
మహారాష్ట్రలో అత్యధికంగా 53 మంది మరణించారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 18,000 మంది కరోనా బారిన పడితే 10,000 కేసులు మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. కాన్సర్ తో బాధపడుతున్న బీజేపీ ఎంపీ ‘ప్రజ్ఞ ఠాకూర్’ ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో ఆమెను భోపాల్ నుంచి విమానంలో ముంబైకి తరలించారు. కోకిలాబెన్ హాస్పిటల్లో చేర్చారు.
గత డిసెంబర్ లో ఆమెకు కోవిడ్ సోకడంతో ఆరోగ్యం విషమించింది. ఫిబ్రవరి నెలలో కొన్నాలు ఢిల్లీ ఎయిమ్స్ లో ఉన్నారు. కోవిడ్ కేసులు భారీగా పెరుగుతూ ఉండటంతో వాక్సిన్ జోరు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
పరీక్షలు జరిపి రోగులను గుర్తించి వైద్యం చేయాలని వ్యూహం ఫలించి గత ఏడాది, కోవిడ్ దేశంలో బాగా అదుపులోకి వచ్చింది. కేసులు బాగా ఉన్న రాష్ట్రాలను అదే వ్యూహాన్ని అనుసరించాలని కేంద్రం ఆదేశించింది.
ఆరోగ్య శాఖ కార్యదర్శి ”రాజేష్ భూషణ్” ఆంధ్రప్రదేశ్ తో సహా పలు ఆరోగ్య శాఖ కార్యదర్శలతో మాట్లాడారు. ఢిల్లీ, హర్యానా, ఒరిస్సా, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల లోని మొత్తం 65 జిల్లాల్లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు.
చేసిన పరీక్షల్లోనూ ఆర్టీపీసీఆర్ వాటా తక్కువగా ఉందన్నారు. వారం వారము కేసులు మాత్రం పెరుగుతున్నాయి అని పాజిటివ్ కాంటాక్టులను అన్వేషించడం జరగడం లేదని ప్రస్తావించారు. ఈ జిల్లాల్లో కేసులు పెరిగితే మరణాల సంఖ్య కూడా భారీగా ఉంటుందని హాస్పిటల్ వసతులను సిద్ధం చేసుకోవాలని హెచ్చరించారు.
ఎక్కువ కేసులు ఉన్న జిల్లాల్లో ప్రాధాన్య వ్యక్తులకు టీకాలు వేయ్యడం జోరు పెరగాలి అని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ సహాయం తీసుకుంటూ రెండో దశ వాక్సిన్ కార్యక్రమాన్ని 15 నుంచి 28 రోజుల్లో పూర్తి చేయాలి అని సూచించారు. కోవిడ్ వ్యాప్తికి కారణమౌతున్న కార్యక్రమాలపై కన్ను వేసి ఉంచాలని కేంద్ర రాష్ట్రాలను ఆదేశించింది.
మరో పక్క కేసులు తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి వైద్య బృందాలను కేంద్ర ప్రభుత్వం పంపించింది. వారు రాష్ట్రాల వైద్య శాఖలకు సలహాలు, సూచనలు ఇస్తారు. కేసుల తీవ్రత నేపధ్యంలో మహారాష్ట్రలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతుంది.
దేశ వ్యాప్తంగా శుక్రవారం 15 లక్షల మందికి కోవిడ్ వాక్సిన్ వేశారు. దానితో ఇప్పటివరకు 1.94 కోట్లమందికి వాక్సిన్ వేసినట్లు అయ్యింది. కోవిడ్ వాక్సిన్ కార్యక్రమం జనవరి 16న మొదలుకాగా శుక్రవారం అత్యధిక సంఖ్యలో వాక్సిన్లు వేశారు. వైద్య సిబ్బందికి ఇతర కోవిడ్ వ్యక్తులకు ఫిబ్రవరి 2 నుంచి వృద్ధులు కొమార్భిడిటిస్ ఉన్నవారికి మార్చ్ 1 నుంచి వాక్సిన్ వేస్తున్నారు.