పదుల సంఖ్య నుంచి వేల సంఖ్యలో కి పెరిగిన కేసులు తగ్గుముఖం పట్టాయని, రకాల సడలింపులు ఇచ్చేయడంతో జనం కూడా జాగ్రత్తలు పాటించడం మానేశారు. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్లు, రాజకీయ పార్టీ మీటింగ్లు ఇలా అందరు బిజీ అయిపోయారు కట్ చేస్తే మళ్లీ మహమ్మారి కరోనా కలవరపెడుతోంది. జీరో నుంచి కేసులు డబల్ డిజిట్ కి చేరుకుంటున్నాయి.
సిక్కోలో పెరుగుతున్న కోవిడ్ కేసులతో మళ్లీ టెన్షన్ మొదలవుతుంది. కోవిడ్ నుంచి పూర్తి గా కోలుకుంటున్న వేళ, శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీనితో ప్రభుత్వం అందరికి అందుబాటులో కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకువచ్చింది. కోవిడ్ వారియర్స్, ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు వృద్ధులకు ఉచితంగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.
అందరు వ్యాక్సిన్ వేయించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు అయినా జిల్లాలో ఇంకా కేసులు పెరుగుతున్నాయి. కేసులు క్రమంగా పెరగడంతో కొంత ఆందోళన కలిగిస్తుంది. వ్యాక్సిన్ వచ్చేసిన ధీమా తో ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా పాటించటం లేదు. మాస్కులు నూటికి పదిమంది కూడా పెట్టుకోవడం లేదు. మరోసారి మాస్కులు పెట్టుకోని వారికి జరిమానా విధిస్తే నే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
గత వారం రోజులుగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. రోజువారి కేసులు పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. దీనితో మరో సారి లాక్‌డౌన్ పెట్టాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి రెడ్ జోన్లను ప్రకటించాలని ఆలోచిస్తున్నారు.