ప్రస్తుతం మన దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా మన దేశంలో గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 41వేల 986 కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో దాదాపు 285 మంది మృతి చెందినట్లు సమాచారం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 72 వేల169 కి చేరింది.
నిన్నఒక్క రోజే దాదాపు లక్ష 17వేల కు పైగా కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. ఫస్ట్ వేవ్ లో రోజువారి కరోనా కేసులు లక్షకు చేరడానికి దాదాపు 103 రోజుల సమయం పడితే, సెకండ్ వేవ్ లో దాదాపు 47 రోజుల సమయం పట్టింది. కానీ ప్రస్తుతం రోజువారి కేసులు చూస్తుంటే సెకండ్ వేవ్ కంటే 5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.
రెండొవ దశలో కరోనా కేసులు గరిష్టంగా 4 లక్షలకు పైగా నమోదయ్యాయి. ప్రస్తుతం రోజువారీ కేసులు చూస్తుంటే ఆ మార్కును కొన్ని రోజుల్లోనే అధిగమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం విదేశాల నుంచి భారత్ కు వచ్చే వారు తప్పనిసరిగా 7 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉంది 8వ రోజు RT-PCR పరీక్ష చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. చిన్నారులకు మాత్రం పరీక్ష నుంచే మినహాయింపు ఇచ్చారు.