దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ ప్రభావం వల్ల ఈ కరోనా కేసులు కొంచం తగ్గుముఖం పట్టాయి. కానీ మరణాలు రేటు మాత్రం తగ్గడంలేదు. రోజుకు సుమారు నాలుగు వేలకు పైగా ఈ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

కరోనా కేసులు రెండు రోజుల నుంచి మూడు లక్షలకు తక్కువగా నమోదు అవుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే ఈ రోజు సుమారు 20 వేల కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో మన దేశంలో 2 లక్షల 64 వేల కేసులు నమోదయ్యాయి. మరోవైపు మృతుల సంఖ్య అంటారని కలవరపెడుతుంది.

రోజు వారి మరణాలు 4 వేలు దాటుతున్నాయి. గడచిన 24 గంటల్లో మన దేశంలో 4 వేల 3 వందల 29 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఒకపక్క రికవరీ రేటు పెరుగుతుంది, నిన్న ఒక్కరోజే 4 లక్షల 22 వేలకు పైగా రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 84.81 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు1.10 శాతం గా కనిపిస్తుంది.

x