దేశంలో కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. చాలా రోజుల తర్వాత లక్ష కేసులు నమోదయ్యాయి. మరో పక్క రికవరీ రేటు కూడా పెరుగుతుంది.

కరోనా కట్టడికి రాష్ట్రాలు చేపట్టిన ఆంక్షలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. సోమవారం లక్ష 635 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రోజువారి కేసులు ఇంత తక్కువగా నమోదు అవ్వడం రెండు నెలల తర్వాత ఇదే తొలిసారి. నిన్న రికార్డ్ అయిన కేసులు ఎక్కువ శాతం ఐదు రాష్ట్రాల్లో నమోదైనవి. ఇటు మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది. కరోనాతో గడిచిన 24 గంటల్లో 2,427 మంది చనిపోయారు.

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో లక్షా 74వేల 399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2 కోట్ల 71 లక్షలు దాటింది. గత 25 రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యశాఖ తెల్పింది. ప్రస్తుతం రికవరీ రేటు కూడా 93.94 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసులు రోజురోజుకు తగ్గుతూ ప్రస్తుతం 14 లక్షలకు చేరాయి. 7 రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 20 లక్షల కు తక్కువగానే ఉన్నాయి.

తెలంగాణ లో ప్రస్తుతం కరోనా పరిస్థితి :

తెలంగాణలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ ప్రారంభం నాటికి రోజు 6 వేల కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ప్రతిరోజు 40 నుంచి 50 మంది కరోనాతో చనిపోయారు. తెలంగాణ మే 12న లాక్‌డౌన్‌ ప్రారంభమైంది. మొదటి వారం రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 4,700 కి చేరిండి. ఆ తర్వాత వారంలో 3,800 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,500 కేసులు నమోదవుతున్నాయి. మొత్తం టెస్టులు చేస్తున్న దానిలో 2 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఏపీ లో ప్రస్తుతం కరోనా పరిస్థితి :

ఏపీ లోను లాక్ డౌన్ ఫలితం కనిపిస్తుంది. రోజువారి కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. కఠిన కర్ఫ్యూ, వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగడంతో కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. దాంతో ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పొడిగించింది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించిన ఏపీ సర్కార్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు చేసింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ ఆఫీసులు పని చేయనున్నాయి.

x