దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో చెలరేగిపోతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వేలాది మంది ప్రజలు కరోనా వల్ల చనిపోతున్నారు. నిన్న ఒక్కరోజే 3 లక్షల 82 వేలా 315 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 3,780 మంది మృతి చెందారు.

ప్రస్తుతంమన ఇండియా లో 34 లక్షల 87 వేల 229 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక పక్క పలు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మరియు ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా మరణాలు మరియు వైరస్ ప్రభావం మాత్రం తాగడం లేదు. వారంలో ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా కరోనా భారిన పడ్డారు.

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతుండటం వల్ల అందరు ఆందోళన చెందుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మే 15 వరకు బీహార్ లో లాక్ డౌన్ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

రోజువారీగా చూసుకుంటే రెండు రోజుల నుండి కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ మల్లి గడిచిన 24 గంటల్లో మరల కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 34 లక్షల 87 వేల 229 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ మరియు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి.

x