దేశంలో కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చినా కరోనా కేసులు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో లక్ష 32 వేల 788 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెల్పింది. అలాగే గడిచిన 24 గంటల్లో 3 వేల 207 మంది కరోనాకు బలయ్యారు. కరోనా నుంచి కొత్తగా 2 లక్షల 31 వేల 456 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 83 లక్షల 7 వేల 832 కు చేరింది. అలాగే దేశంలో ఇప్పటివరకు 2 కోట్ల 61 లక్షల 79 వేల 85 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 3 లక్షల 35 వేల 102 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో 17 లక్షల 93 వేల 645 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 21 కోట్ల 85 లక్షల 46 వేల 667 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయింది.