24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు:
ఏపీ లో కరోనా కేసులు లెక్కకుమించి పెరిగిపోతున్నాయి. కోవిడ్ బాధితులు భారీగా ఆస్పత్రికి వస్తుండటంతో బెడ్స్ కొరత ఏర్పడుతుంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల 972 పరీక్షలు నిర్వహించగా 11,698 కేసులు నమోదయ్యాయి. 37 మంది ప్రాణాలను కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షల 20 వేలకు పైగా కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మృతుల వివరాలు:
24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ప్రాణాలను కోల్పోయారు. తూర్పు గోదావరి నెల్లూరు జిల్లాలో ఆరుగురు, అనంతపురం మరియు చిత్తూరులో నలుగురు చొప్పున, శ్రీకాకుళం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు చొప్పున, గుంటూరు, కృష్ణ, విశాఖ, విజయనగరం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా వల్ల మూర్తి చెందారు. ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 7616 చేరండి.
గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా రికవరీ కేసుల వివరాలు:
గడిచిన 24 గంటల వ్యవధిలో 4428 మంది బాధితులు కరోనా నుంచి కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9 లక్షల 31వేల 839 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81 వేల 471 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
భారత్ బయోటెక్ శ్రీరామ్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ:
భారత్ బయోటెక్ శ్రీరామ్ సంస్థలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. రెండు సంస్థలు 4.08 కోట్ల విలువైన వాక్సిన్ డోసులు సరఫరా చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 2.4 కోట్ల మందికి రెండేసి డోసులు చొప్పున వ్యాక్సిన్ ఇవ్వాలని రెండు సంస్థలను ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరకే వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ ఏపీ ప్రభుత్వం లేఖలో తెలిపింది.