భారత దేశంలో కరోనా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో గడిచిన 24 గంటల్లో నాలుగు లక్షలకు చేరువలో కొత్త కేసులు నమోదు కాగా,అటూ మరణాలు కూడా నాలుగు వేలకు చేరువలో నమోదుకావడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

గడచిన 24 గంటల్లో కొత్తగా 3లక్షల 79 వేల 257 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న రెండు లక్షల 69 వేల 507 మంది కరోనా నుంచి కోలుకున్నారు . దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య ఒక కోటి 83 లక్షల 76 వేల 524 కు చేరుకుంది. మరోవైపు గడచిన 24 గంటల్లో 3,645 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 2 లక్షల 4 వేల 832 కి చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు ఒక కోటి 50 లక్షల 86 వేల 878 మంది కోలుకున్నారు. 30 లక్షల 84 వేల 814 మంది హాస్పిటల్స్ మరియు హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.

x