ఇక కరోనా వస్తే మగవాళ్ళలో తేడా ఖాయమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా సోకిన పురుషుల్లో నపుంసకత్వం వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉండని రోమ్ యూనివర్సిటీ పరిశోధన తేల్చింది. మహమ్మారి కరోనా చేస్తున్న డామేజ్ అంతా ఇంతా కాదు. మనుషుల జీవితాలు సర్వనాశనం చేస్తుంది ఈ కరోనా.

కరోనా సంబంధించిన పురుషులకు చాలా ప్రమాదం పొంచి ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వల్ల మగవాళ్లకు నపుంసకత్వం వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ అని తేలింది. రోమ్ యూనివర్సిటీ 100 మంది పై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం రుజువైంది.

కరోనా సోకిన తర్వాత చాలా మందికి సంతానలేమి సమస్యలు వచ్చినట్లు గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా పురుషుల్లో అంతరస్తరము (endothelium) సమస్యలు ఉత్పన్నమవుతాయని రోమ్ యూనివర్సిటీ అధ్యయనం తేల్చింది. మనిషి రక్తంలో ప్రవేశించిన తర్వాత కరోనా వైరస్ చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. వైరస్ సోకిన పురుషుల్లో లైంగిక సమస్యలు బాగా పెరిగినట్లు గుర్తించారు. పురుషులపై కరోనా‌ ప్రభావానికి సంబంధించి ఇది కొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా కరోనా‌ వల్ల మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని నిర్ధారణ అయింది. తాజా అధ్యయనం కూడా మరో బాంబు పేల్చింది. మగవారికి కరోనా సోకడం వల్ల నపుంసకత్వం వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉందని రోమ్ యూనివర్సిటీ ప్రకటించడం తో ఈ వార్త సంచలనం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా‌ కల్లోలం పెరుగుతుండి గాని తగ్గడం లేదు. అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ కూడా ప్రకటించాయి. కరోనా‌ తో మనుసులు శారీరక మానసిక సమస్యలతో అల్లాడిపోతున్నారు. వాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా‌ నుంచి తప్పించుకోవటం 100% సాధ్యం కావడం లేదు

x