దేశంలో కొనసాగుతున్న రెండు దశ కరోనా విజృంభన, కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 62,558 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. ఇందులో మహారాష్ట్రలోనే 24 గంటల్లో దాదాపు 27 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా గుప్పిట్లో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. దాదాపు ఐదు నెలల తర్వాత ఒక రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో మొత్తం బాధితుల సంఖ్య ఒక కోటి 19 లక్షలు దాటింది. ఇక నిన్న 30,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఇప్పటివరకు ఒక కోటి 12 లక్షల 95 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజు 291 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య లక్ష 61 వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో సుమారుగా 4,52,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు ఐదు కోట్ల 81 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.

x