దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అమెరికా, బ్రెజిల్ తర్వాత 3 లక్షల మరణాలు నమోదైన దేశంగా భారత్ నిలిచింది.
ప్రస్తుతం దేశంలో కరోనా వివరాలు :
దేశంలో గత రెండు వారాలుగా రోజువారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 2 లక్షల 22 వేల 315 కేసులు నమోదైయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసులు 2 కోట్ల 67 లక్షల 52 వేల 447 కు చేరింది. రికవరీ రేట్ 88.69 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 3 లక్షల 02 వేల 544 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలోని 27 రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసులు కంటే రికవరీ ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీ లో ప్రస్తుతం కరోనా వివరాలు :
ఏపీ లో కొత్తగా 12 వేల 994 కరోనా కేసులు నమోదైయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 15 లక్షల 93 వేల కు చేరింది. 96 మంది కరోనాకు బలయ్యారు. ఏపీలో కొత్తగా కరోనా నుంచి కోలుకున్న వారు 18 వేల 373 మంది. ఏపీలో ప్రస్తుతం 2 లక్షల 3 వేల 762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 18 వేల 373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి కారణంగా చిత్తూరు జిల్లాలో అధికంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, కర్నూలు మరియు విజయనగరం జిల్లాలలో పదిమంది, అనంతపురంలో తొమ్మిది మంది చనిపోయారు.
తెలంగాణలో ప్రస్తుతం కరోనా వివరాలు :
తెలంగాణలో కొత్తగా 3 వేల 43 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 56 వేల 320 కి చేరింది. కొత్తగా 21 మంది మహమ్మారి వల్ల చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 3 వేల 146 కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 39 వేల 206 పాజిటివ్ కేసులు ఉన్నాయి.