ప్రస్తుతం మనం ఊహించినట్టుగానే కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ భారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది ప్రముఖులు ఈ వైరస్ భారిన పడ్డారు. సినీ ఇండస్ట్రీలో ఒకరి తరువాత ఒకరికి ఈ వైరస్ సోకుతు ఉండటంతో ఆ ప్రభావం సినిమాల పై పడుతుంది.

ఈ కరోనా వల్ల చిత్రసీమకు మళ్లీ భారీ నష్టం వచ్చేలా ఉంది. ఇప్పటికీ మహేష్ బాబు, తమన్, మంచు లక్ష్మి, మంచు మనోజ్, సత్య రాజ్, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, ఇషా చావ్లా, త్రిష, వరలక్ష్మి శరత్ కుమార్, సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా తో పాటు ఎంతోమంది కరోనా బారినా పడ్డారు.

ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తో పాటు ఆమె తనయుడు అఖిరా నందన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయం గా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ, “నేను, అఖీరా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడ్డాము. మాకు కరోనా లక్షణాలు కనిపించటంతో పరీక్షలు చేయించుకున్నాము. అది పాజిటివ్ అని తేలింది.

ప్రస్తుతం మేము కోలుకుంటున్నాము. ఈ కరోనా థర్డ్ వేవ్ ను చాలా సీరియస్ గా తీసుకోండి. అందరు మాస్కులు ధరిస్తూ.. కనీస దూరం పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండండి” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అఖీరా తొందరగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నారు.

x