మనుషుల పైన కాదు జంతువుల పైన కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ కరోనా వైరస్ వల్ల ఒక సింహం చనిపోయింది. తమిళనాడులోని ఓ జూలో కరోనా తో ఒక సింహం మృతి చెందడం కలకలం రేపుతోంది.

వండలూర్ అరిగ్నార్ అన్నా జూ లో ఈ సంఘటన జరిగింది. నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ ? సింహం కరోనా కు బలైంది. ఈ జూ లో మొత్తం 11 సింహాలు ఉండగా, తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లాక్ డౌన్ కారణంగా నెలరోజులుగా ఈ అరిగ్నార్ అన్నా జూ మూసి ఉంది. ఈ జూ లోని సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ఇచ్చారు. వారిలో ఎవరికీ కరోనా సోకలేదు. కానీ, సింహాలకు కరోనా ఎలా సోకిందనే విషయం అర్ధం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

x