ప్రస్తుతం మన దేశంలో 2.5 లక్షలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లోమన దేశంలో 2 లక్షల 58 వేల 089 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే తెలంగాణ లో కూడా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. నిన్న తెలంగాణ రాష్ట్రంలో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే, తాజాగా గాంధీ ఆసుపత్రిలో మొత్తం 120 మంది వైద్యులకు కరోనా సోకింది. 40 మంది PG విద్యార్థులకు, 38 మంది హౌస్ సర్జన్లకు, 35 మంది MBBS విద్యార్థులకు మరియు ఆరుగురు ఫ్యాకల్టీకి ఈ కరోనా సోకినట్లు సమాచారం. ఇంకా కొందరి రిపోర్ట్స్ రావాల్సి ఉండడంతో కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరందరిని ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

కరోనా కేసులు పెరగడంతో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను పొడిగించింది. మొదట 8వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు ఇచ్చిన సెలవలు, ఇప్పుడు 30వ తేదీ వరకు పొడిగించారు. కరోనా ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నాయి. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూ పెట్టాలా.. లేదా.. విషయాలపై రాష్ట్ర కేబినెట్ లో చర్చించనున్నారు.

 

x