దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. భారీగా మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజుకి 45 వేల నుంచి 50 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా కరోనా బారిన పడుతున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ గెలిచిన ఇండియా లెజెండ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఒక్కసారిగా సచిన్ టెండూల్కర్ కి కరోనా పాజిటివ్ అన్న వార్త విని అభిమానులు షాక్ అయ్యారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అని అందరూ కూడా తెగ ఆలోచిస్తున్నారు. ఈరోజు కొన్ని లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నను పాజిటివ్ వచ్చింది. మా ఇంట్లో మిగిలిన వారికి నెగిటివ్ వచ్చింది.
మా ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాను. డాక్టర్లు సూచించిన ప్రకారం కరోనా ప్రోటోకాల్ పాటిస్తాను. కరోనాని జయించడానికి సహకరిస్తున్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు సచిన్ టెండూల్కర్. అయితే కుటుంబ సభ్యులందరికీ కూడా నెగిటివ్ వచ్చింది ముఖ్యంగా తన కుమారుడికి కూడా నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.మొత్తానికి సచిన్ టెండూల్కర్ కి కరోనా పాజిటివ్ అన్న వార్త తెలిసి అభిమానులు షాక్ అయ్యారు.
చిన్న లక్షణాలు కనిపించడం తోనే ప్రాథమికంగా టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తుంది. గతవారం లక్నోలో టీం ఇండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్, సేహ్వాగ్ జట్టుతో కలిసి రోడ్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడారు సచిన్ టెండూల్కర్. 200 టెస్టులు ఆడితే 277 టెస్టులు చేయించుకున్న అని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు.