కరోనా రోజురోజుకి విజృంభిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ కరోనా వైరస్ వ్యాపిస్తుంది. ఇటీవల చాలా మంది సినీ సెలబ్రెటీలకు కరోనా వ్యాపించింది. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ వచ్చింది.

ఆ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేసాడు. గత రెండు రోజుల నుంచి జ్వరం తలనొప్పి ఉండటంతో కరోనా టెస్ట్ చేయించుకున్నాను. దీంతో కరోనా పాజిటివ్ అని తేలింది. తాను సురక్షితంగా ఉన్నానని, నేను ఇంట్లో ఒంటరిగా ఉంది అన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నాను, అభిమానులు అందరూ జాగ్రత్తగా ఉండాలని, అందరు అన్నివేళలా మాస్క్ మరియు శానిటైజర్ వాడాలని, ఇంట్లోనే ఉండాలని అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మండన్న మహిళా కథానాయికగా నటించింది.

x