ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి, మరియు ప్రతి రోజు సుమారు 3 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కరోనా సామాన్యులనే కాదు సెలబ్రెటీస్ ను కూడా వదిలి పెట్టడం లేదు.

ప్రస్తుతం సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తాను కరోనా టెస్ట్ చేయించుకో గా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్.

ప్రస్తుతం తను సెల్ఫీ క్వారంటైన్ లో ఉన్నానని అభిమానులు ఎవరు కంగారు పడాల్సిన పని లేదని సూచించారు. డాక్టర్ల పర్యవేక్షణలో కరోనా జాగత్తలు పాటిస్తానని చెప్పారు. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్ళు కూడా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ”అని తారక్ ట్వీట్ చేశారు.

ఇంతకుముందు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోలు కూడా ఈ కరోనా వ్యాధి భారిన పడ్డారు. ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ వైరస్ వచ్చింది.

x