దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే, గత ఐదు రోజుల్లో కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 50 వేలకు పైగా తగ్గుముఖం పట్టాయి. దీంతో గత 24 గంటల్లో మన దేశంలో 2 లక్షల 55 వేల 874 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రోజువారి పాజిటివిటీ రేటు చుస్తే 15.52 శాతానికి తగ్గింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 614 మంది కరోనా తో మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 22 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా ఉదృతి ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. థర్డ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వ వర్గాలు ఊరటను ఇచ్చే మాటలు చెప్పారు. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పడతాయని వారు చెప్పుకొచ్చారు.

కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం థర్డ్ వేవ్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించిందని చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లోని మెట్రోనగరాల్లో కేసులు తగ్గటం ప్రారంభమైందని, ఫిబ్రవరి 15 నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

x