KEY POINTS

. గాలి ద్వార వైరస్ వ్యాప్తి

. వైరస్ వాహకాలు

.కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు

1. గాలి ద్వార వైరస్ వ్యాప్తి:

కరోనా వైరస్ ఇన్నాళ్లు కేవలం ముక్కు మరియు నోరు ద్వారా వ్యాపిస్తుందని మనం అనుకున్నాము. కానీ ఇప్పుడు కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. మన చుట్టూ ఉన్న గాలిలోనే వైరస్ ఉందని అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. మనం దగ్గినా, తుమ్మినా గాలిలో కి కరోనా వైరస్ చేరుతున్నట్లు “లాన్సెట్ సర్వే” స్పష్టం చేసింది. సాధారణ ప్రాంతాలలో ఈ వైరస్ మూడు మీటర్ల వరకు మరియు మూసి ఉన్న ఎసి గదిలో అయితే 20 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి చెందుతుందని లాన్సెట్ సర్వేలో బ్రిటన్, అమెరికా మరియు కెనడా శాత్రవేతలు తేల్చిచెప్పారు.

2. వైరస్ వాహకాలు:

సిసిఎంబి ఈ లాన్సెట్ అధ్యాయాన్ని ధృవీకరించండి. సైలెంట్ ట్రాన్స్మిషన్ వల్లే ప్రస్తుతం నమోదవుతున్న మొత్తం కేసుల్లో 40 శాతం కేసులు వస్తున్నట్లు ఈ అధ్యయనం చెబుతోంది. ఆరుగురు సైంటిస్ట్ ల బృందం లోతైన అధ్యయనం చేసి ఈ విషయం చెప్పారు. పబ్లిక్ టాయిలెట్స్ మరియు దవాఖానాలు వైరస్ యొక్క వాహకాలుగా మారుతున్నాయని తెలిపింది. సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదం గా మారటానికి కూడా ఇదే కారణం. ప్రపంచ దేశాలు ఈ దిశగా వైరస్ నిర్మూలనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

CCMB supporting the Lancet survey

3. కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు:

కరోనా సెకండ్ వేవ్ లక్షణాల లోనూ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. మొదటి వేవ్ లో జ్వరం, ఒళ్ళు నొప్పులు, వాసన, రుచి కోల్పోవటం, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. ఈసారి సెకండ్ వేవ్ లో కొన్ని కొత్త లక్షణాలను వైద్యులు గుర్తించారు. కళ్ళు గులాబీ రంగులోకి మారడం, నీళ్ల విరోచనాలు, వినికిడి సమస్య మొదలైన లక్షణాలు ఈ దశలో కనిపిస్తున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.

image source

x