ఏప్రిల్ 4న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ చాలా వైరల్ గా మారింది. ఈశ్వర.. పవనేశ్వర.. పరమేశ్వర.. అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికి టాప్ ట్రెండ్ లో ఉంది. అయితే గత సంవత్సరం ఇండియాలో మొదట అప్పుడప్పుడే కరోనా వైరస్ సోకుతున్న తరుణంలో బండ్ల గణేష్ కు కరోనా వచ్చింది. దీనితో హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేయించుకొని, పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ బయటకు వచ్చారు.
ఒక సారి కరోనా వచ్చిన తర్వాత రెండోసారి ఈ వైరస్ సోకడం చాలా అరుదుగా జరుగుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. తాజాగా బండ్ల గణేష్ కు మరోసారి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బండ్ల గణేష్ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి వచ్చిన తర్వాత రోజు నుంచి ఆయనకు తీవ్ర ఒళ్ళు నొప్పులు మరియు జ్వరం తో బాధ పడుతున్నారు. దీనితో ఆయన కోవిద్ పరీక్షలు చేయించుకోగా మళ్ళి పాజిటివ్ అని తేలింది. ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రి ఐసీయూలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం బండ్ల గణేష్ ఆరోగ్యంగానే ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ సినిమా ఈవెంట్ కు హాజరైన చాలామందికి కరోనా సోకుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం టాలీవుడ్ పై గట్టిగా పడింది. టాలీవుడ్ లోని చాలా మంది ప్రముఖులు కరోనా భారీనా పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
టాలీవుడ్లో ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు మరియు వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నివేదా థామస్ కరోనా భారీన పడ్డారు. ఈ కరోనా ప్రభావం రోజురోజుకు ఎక్కువ అవడంతో ఈ వారం నుంచి విడుదల కావాల్సిన సినిమాలు కూడా చాలా వరకు వాయిదాలు పడుతున్నాయి.