మహారాష్ట్రలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీనితో పాటు మరో ఆశాజనక విషయం వెలుగు చూసింది.
సోమవారం ఉదయం తక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం 8,766 పరీక్షలు చేయగా 700 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ముంబై లో ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
మరోవైపు రికవరీ రేటు కూడా 73 శాతానికి చేరుకుంది. ఇది తెలిసిన తర్వాత ముంబై ప్రజలు కాస్త ఊరట పొందారు.
అటు ఢిల్లీలోనూ కరోనా ఉధృతి తగ్గింది. ఢిల్లీలో గత 24 గంటల్లో కేవలం 613 కేసులు మాత్రమే రికార్డు అయ్యాయి.