మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ఈమధ్య ఒక సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా ను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శంకర్ గారు. ఈ మూవీ గురించి రోజుకో అప్డేట్స్ రావడం తో, ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే లైకా ప్రొడక్షన్ ఈ సినిమా విషయమై కోర్టుకు వెళ్ళింది అనే విషయం అభిమానులను కంగారు పెడుతుంది.

డైరెక్టర్ శంకర్ కమలహాసన్ తో ఇండియన్ 2 మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే, ఈ మూవీ కొన్ని అనివార్య కారణాలవల్ల షూటింగ్ మధ్య కాలంలో ఆపేశారు. ఈ సినిమా భారతీయుడు సినిమాకి సీక్వెల్గా రూపొందుతుంది. ఇండియన్ 2 షూటింగ్ తీస్తున్నప్పుడు సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో యూనిట్ సిబ్బంది కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం అప్పుడు కోర్టు దాకా వెళ్ళింది. దీనికి సంబంధించి మూవీ మేకర్స్ చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత కమల్ హాసన్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఈ సినిమాలో నటిస్తున్న కాజల్ ఈ మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తనకు ఇండియన్ 2 నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదని చెప్పింది. ఇంకా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టి రామ్ చరణ్ తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు.దేనితో లైకా ప్రొడక్షన్ వాళ్ళు కోర్ట్ కి వెళ్లినట్లు తమిళ మీడియా వర్గాల సమాచారం. ఈ సినిమాకు గాను తమకు కేటాయించిన 230 కోట్ల రూపాయల లో ఇప్పటివరకు 180 కోట్లు ఖర్చు పెట్టించారు డైరెక్టర్ శంకర్, కానీ ఈ సినిమాను మాత్రం పూర్తి చేయకుండా ఇంకో సినిమాకు వెళ్ళటం సరికాదని కోర్టుకు తెలిపారు.

 

x