మన దేశంలో ఒక వైపు కరోనా కేసులు మరోవైపు ఓమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువయ్యాయి. ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5 వేలకు చేరువయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం తగిన రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వివిధ రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ సమావేశం కానున్నారు.
ఈ వర్చువల్ సమావేశం ఈరోజు సాయంత్రం 4: 30కి జరగనుంది. ఈ సమావేశంలో పెరుగుతున్న కేసులు… తీసుకోవాల్సిన జాగత్తల గురించి చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత కొత్త మార్గదర్శకాలను కేంద్రం రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి.
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో వైద్య కేంద్రాల వద్ద సరైన ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ‘రాజేష్ భూషణ్’ వెల్లడించారు. కనీసం 48 గంటలకు సరిపోయే ఆక్సిజన్ బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు.