కరోనా మహమ్మారి దేశంలో అందరిని గడగడలాడిస్తోంది. రోజురోజుకి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో ప్రజలందరూ ఎంతో భయపడుతున్నారు. కరోనా ఏ రంగాన్ని విడిచి పెట్టడం లేదు. అటూ క్రీడా రంగంలో గాని ఇటు సినీ రంగంలో గాని దీని ప్రభావం వల్ల చాలా మంది బలవుతున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ వైరస్ భారిన పడింది. కరోనా లక్షణాలు రావడం తో తాను పరీక్ష చేయించుకున్నానని ఫలితం పాజిటివ్ గా వచ్చిందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. “గత కొన్ని రోజులుగా నా కళ్ళ కొంచెం మంటగా ఉన్నాయి మరియు నేను బలహీనంగా ఉన్నాను, హిమాచల్ వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి నిన్న కరోనా పరీక్ష చేయించుకున్నాను అది పాజిటివ్ అని తేలింది” అని కంగనా ట్విట్ చేశారు.
ఆమె ఇలా చెప్పుకొచ్చింది, “నేను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను, ఈ వైరస్ నా శరీరంలోకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, ఇప్పుడు నేను దానిని ఎదురుకుంటానని నాకు తెలుసు, ప్రజలందరూ దయచేసి మీరు మీ శక్తిని కోల్పోకండి, మీరు దాన్ని చూసి భయపడితే అది మిమ్మల్ని మరింత పెడుతుందని” ఆమె ట్విట్ చేసింది.
కంగనా మూవీస్ కంటే వివాదాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. కంగనా రనౌత్ పదేపదే రెచ్చగొట్టే కామెంట్లను ఉద్దేశపూర్వత ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆమె అకౌంట్ను శాశ్వతంగా తొలగించింది. బెంగాలీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత కంగనా చేసిన ట్వీట్ తో ట్విట్టర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
మమత పై దాడి చేయడానికి మోడీ రెండు వేల నాటి వ్యూహాలను అమలు చేయాలని కంగనా ట్విట్ చేసింది. కంగనా కామెంట్స్ పై నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ట్విట్టర్ ఆమె అకౌంట్ ని తొలగించండి. ప్రస్తుతం ఆమె జయలలిత బయోగ్రఫీ లో తెరకెక్కుతున్న తలైవి సినిమాలో నటిస్తుంది.