ఈ రోజు నందమూరి బాలకృష్ణ తన 61 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా చాలా మంది సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, బాలయ్య అభిమానులకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నుండి మధురమైన ఆశ్చర్యం లభించింది. బాలకృష్ణతో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ యువి బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“నందమూరి బాలకృష్ణ సర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఎంటర్‌టైనింగ్ పర్ఫార్మెన్స్ తో మరియు మానవతా దృక్పథం కలిగిన సేవా కార్యక్రమాలతో మరింత మందిని ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాను” అంటూ బాలకృష్ణతో దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు యువి. ఈ పోస్టుకి ‘HappyBirthdayNBK’ అనే హ్యాష్ ట్యాగ్ ను యాడ్ చేశాడు యువి.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపతి శ్రీను యొక్క అఖండ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తరువాత, నటుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు.

x