గంగ నదిలో శవాలు పైకి తేలియాడుతున్నాయి. అసలు ఆ శవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఎవరికి అర్ధం కావడం లేదు. ప్రస్తుతం బీహార్ మరియు యుపీ నదుల్లో కిలోమీటర్ దూరంలో సుమారు 150 శవాలు తేలుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్టాలు భయాందోళనకు గురవుతున్నాయి. రోజురోజుకి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అదే స్థాయిలో రోజుకి 3 వేలకు పైగా జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో చనిపోయిన శవాలు నది తీరాల్లో పైకి తేలడంతో ప్రజలు విపరీతంగా భయపడుతున్నారు. కరోనా తో ఎవరినా చనిపోతే అసలు దగ్గరకు రాని పరిస్థితి మనం చుస్తున్నాం. ఈ తరుణంలో యూపీ ,బీహార్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో చనిపోయిన శవాలను కాల్చకుండా నదిలో పారేస్తున్నారు.

ముఖ్యంగా బీహార్‌ కు చెందిన బక్సర్ జిల్లాల్లో కిలోమీటరు దూరంలో సుమారు 100పైగా శవాలు ఒడ్డుపైకి తేలుతూ ఉండటం పోలీసులు గుర్తించారు. ఆ మృత దేహాలు ఒడ్డకు రావడంతో ఆ శవాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. ఈ మృత దేహాల వల్ల కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూపీకి చెందిన హామిపూర్ జిల్లలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. యూపీలోని యమునా నదిలో కూడా శవాలు తేలుతు కనిపించాయి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో కరోనా తో చనిపోయిన వారు ఎక్కువగా ఉండడంతో శ్మశానాలు కాళీగాలేవు. దీంతో కొంతమంది ప్రజలు శవాలను నదిలో వదిలేస్తున్నారు.

అయితే హమీపూర్ జిల్లా కు చెందిన ఎస్పీ అనుప్‌కుమర్ మాత్రం ఈ విషయం పై మరో రకంగా స్పందించారు. ఆయా జిల్లాలకు చెందిన పలు తెగల వారు చనిపోయిన తర్వాత వారి శవాలను కాల్చడం కాని, పూడ్చడం గాని చేయరని చెప్పారు. దీంతో నదుల్లో శవాలు తేలుతూ కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు.

x