first innings:
ఐపీఎల్ రెండవ మ్యాచ్ చెన్నై కి మరియు ఢిల్లీ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టీం పవర్ ప్లే లో రెండు వికెట్లు కోల్పోయి, కేవలం 33 పరుగులు మాత్రమే చేసింది. గైక్వాడ్ మరియు డుప్లిసిస్ ఈరోజు జరిగిన మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన మోయిన్ అలీ మరియు రైనా అద్భుతంగా ఆడారు. వీరిద్దరి పార్టనర్ షిప్ బలపడుతున్న తరుణంలో మోయిన్ అలీ, అశ్విన్ వేసిన బౌలింగ్లో శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు తో సురేష్ రైనా అద్భుతంగా ఆడాడు. అంబటి రాయుడు 16 బంతుల్లో 23 పరుగులు చేసి టామ్ కరణ్ వేసిన బౌలింగ్లో శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సురేష్ రైనా మాత్రం ఈ రోజు అద్భుతంగా ఆడి ఈ ఐపీఎల్లో తన మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సురేష్ రైనా 36 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సలు మరియు మూడు ఫోరులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్ అద్భుతంగా ఆడటంతో చెన్నై స్కోర్ 188/7 పరుగులకు చేరుకుంది. ఈరోజు మ్యాచ్లో ధోని అనుకోని రీతిలో ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు.
second innings:
ఆ తర్వాత ఢిల్లీ టీమ్ తన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. మొదట పృథ్వి షా మరియు శిఖర్ ధావన్ బరిలోకి దిగారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడి తమ పాట్నర్షిప్ బలపరుచుకున్నారు. పృథ్వీ షా కేవలం 38 బంతుల్లో 72 పరుగులు సాధించి తమ టీమ్ ను గెలుపు దిశగా తీసుకువెళ్లాడు. పృథ్వీ షా మరియు శిఖర్ ధావన్ మధ్య పార్ట్నర్షిప్ 138 పరుగుల వరకు కొనసాగింది. ఆ తర్వాత పృథ్వీ షా, డీజే బ్రావో బౌలింగ్ లో మోయిన్ అలీ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ మరియు స్టోనిక్స్ పర్వాలేదనిపించారు. శిఖర్ ధావన్ కేవలం 54 బంతుల్లో 85 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఠాకూర్ బౌలింగ్లో శిఖర్ ధావన్ lbw గా అవుట్ అయ్యే వెనుతిరిగాడు. అప్పటికే మ్యాచ్ అంత ఢిల్లీ చేతిలోకి వచ్చేసింది. చెన్నై టీమ్ చేసిన 188 పరుగులను ఢిల్లీ టీమ్ కేవలం 18.4 ఓవర్లోనే చేధించింది. దీంతో ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ ను ఢిల్లీ టీమ్ గెలిచింది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో చెన్నై టీమ్ బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రిషబ్ పంత్ మొట్టమొదటిసారిగా ఢిల్లీ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించి, తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ను గెలిచాడు. రేపు జరుగనున్న మ్యాచ్ SRH vs KKR