ఈ ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. పంజాబ్ ఇచ్చిన 107 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఆ స్కోర్ ను చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ 31 బంతుల్లో 46 పరుగులు చేసి చెన్నై విజయం సాధించడం లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

చెన్నై 24 పరుగుల వద్ద గైక్వాడ్ 5 పరుగులు చేసి తొలి వికెట్ గా వెనుతిరిగి వెళ్లాడు. తరువాత దిగిన మొయిన్ అలీ, డుప్లెసిస్ తో కలిసి 67 పరుగుల పాట్నర్షిప్ నీ జోడించాడు. ఈ ఇద్దరు కూడా పంజాబ్ కింగ్స్ బౌలర్స్ ని ఒక ఆట ఆడుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ చెన్నైను లక్ష్యం వైపు నడిపించారు. రైనా 8 పరుగులకు మరియు అంబటి రాయుడు డక్ అవుట్ గా వరస బంతుల్లో ప్రేవిలియన్ చేరారు. అయితే మిగిలిన స్కోర్ ని డుప్లెసిస్ 36 పరుగులు చేసి శ్యామ్ కరణ్ 5 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి మ్యాచ్ ని ముగించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ధోని తన 200వ మ్యాచ్ ని ఆడుతున్నారు. చెన్నై కెప్టెన్ ధోనీకి తన టీమ్ ఘనమైన విజయాన్ని అందించింది.

అయితే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 106 పరుగులు మాత్రమే చేసింది. అది కూడా యంగ్ బ్యాట్స్మెన్ షారుక్ ఖాన్ ఆడటంతో పంజాబ్ కింగ్స్ కు ఆ మాత్రమైనా పురుగులు వచ్చాయి. షారుఖాన్ 36 బంతుల్లో 47 పరుగులు చేసి పంజాబ్ స్కోర్ ని 100 పరుగులు దాటించాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో దీపక్ చాహర్ చెలరేగి బౌలింగ్ చేశాడు. తను నాలుగు ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు ఇచ్చి, 4 వికెట్లను తీశాడు.

ఇక ఫీలింగ్ లో జడేజా అద్భుతంగా రాణించాడు. కేఎల్ రాహుల్ రనౌత్, మరియు క్రిస్ గేల్ క్యాచ్ ను పట్టిన తీరు ఈ మ్యాచ్ కు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఒకరకంగా కె.ఎల్.రాహుల్ ను జడేజా రనౌత్ చేయడంతోనే ఈ మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మేన్స్ ఎవరు నిలబడలేదు. ఇక ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్ టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ లను దెబ్బతీసిన దీపక్ చాహర్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

x