ఓ తల్లి అనుకోకుండా చేసిన పనికి తన సొంత కూతురు చేయి తెగిపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన అక్కయ్యపల్లె లో జరిగింది. అక్కయ్య పల్లెలో సయ్యద్ ఆరిపుల్ల, పరీదా దంపతులు ఉన్నారు. వారికి ముగ్గురు పిల్లలు, వారిలో పెద్ద కూతురు ఆయిషా, ఆమెకే ఈ ఘటన జరిగింది. ఆయిషా తండ్రి పని నిమిత్తం కోసం కువైట్ కు వెళ్ళాడు. ఆయిషా తల్లి పిల్లలతో కలిసి ఇంటి వద్దనే ఉంటుంది. వీరు రెండో అంతస్తు లో ఉంటున్నారు.

ఆయుష తల్లి ఫరీదా, చెత్త బండి వచ్చినప్పుడు తమ ఇంట్లో చెత్తను మొత్తం ఒక బక్కెట్లో వేసి దానిని తాడు సహాయంతో కిందకు పంపించేది. కాకపోతే ఆ బక్కెట్ కు తాడు కు బదులుగా పాత విద్యుత్ తీగ ఉంటే దానిని కట్టింది. ఆ విద్యుత్ తీగకు అక్కడక్కడ అతుకులు ఉన్నాయి. ఫరీదా చెత్త బండి వచ్చినప్పుడు చెత్తను కిందకు దింపుతున్న ప్రయత్నంలో తన కూతురు ఆయిషా కింద ఉంది ఆ బక్కెట్ ను పట్టుకొని చెత్తను చెత్త బండిలో వేసే ప్రయత్నంలో వైరు విద్యుత్ తీగకు తగిలింది.

అప్పుడు వెంటనే కరెంట్ షాక్ తగలడంతో ఆయిషా చెయ్యి ఒక్కసారిగా తెగిపడింది. ఆయిషా కు కరెంట్ షాక్ తగలడం గమనించిన స్థానికులు వెంటనే అక్కడ కరెంటు ను ఆపేశారు. తన కూతురు ని కాపాడే ప్రయత్నంలో ఆయిషా తల్లికి కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

x