ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ఒకటి. ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌలి ఈ చిత్రానికి దర్శకుడు. ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌ అవుతోంది.

ఈ పోస్టర్లో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఒకే బైక్ పై నవ్వుతు కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ వాహనాన్ని నడుపుతుండగా, రామ్ చరణ్ వెనుకాల కూర్చున్నాడు. ఈ పోస్టర్ ను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తనదైన శైలీలో ఉపయోగించుకున్నారు. సైబరాబాద్‌ పోలీసులు ఇద్దరు నటులకు హెల్మెట్లు జోడించి చిత్రాన్ని సవరించారు.

వారు సవరించిన చిత్రాన్ని షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “ఇప్పుడు ఇది ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ పోస్టర్ పై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ కూడా ఈ ట్వీట్ పై ఫన్నీగా స్పందించింది. “ఇప్పటికీ ఇది పరిపూర్ణంగా లేదు. నంబర్ ప్లేట్ మిస్సయింది” అంటూ ఫన్నీగా బదులు ఇచ్చారు.

ఇది కాకుండా చాలా మంది ఈ చిత్రాన్ని రకరకాలుగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు!

x